డీసీసీ అధ్యక్షుడిగా పిన్నింటి రఘునాథ్ రెడ్డి
MNCL: తెలంగాణ (TPCC) పరిధిలోని జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు (DCC) నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మంచిర్యాల జిల్లా అధ్యక్ష బాధ్యతలు పిన్నింటి రఘునాథ్ రెడ్డికు అప్పగించారు. ఈ నియామకంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మరింత బలోపేతం కానున్నాయని నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.