పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో
అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO సుబ్రహ్మణ్యం తెలిపారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 22,149 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. వీరి కోసం 124 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం 9 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామని వెల్లడించారు.