లింగపాలెంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు
ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో మంగళవారం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో అనధికారికంగా బెల్ట్ షాప్ నడుపుతున్న ఒక మహిళ వద్ద నుండి 19 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. వేములపల్లి గ్రామంలోని పాత నాటు సారాయి కేసులో బైండోవర్ చేసిన బాండ్‌ను ఉల్లంఘించిన కారణంగా తహసీల్దార్ రూ:3000/- అపరాధ రుసుమును విధించారు.