నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
HNK: బాలసముద్రం సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని TGNPDCL EE సాంబా రెడ్డి తెలిపారు. PMI పనుల్లో భాగంగా కంచర కుంట, ఏసియన్ మాల్, లష్కర్ బజార్ ఏరియాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.