ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన మున్సిపల్ ఛైర్మన్
KDP: మైదుకూరు మున్సిపాలిటీకి మొదటి సారిగా విచ్చేసినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ని సోమవారం మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ మాచనూరు చంద్ర మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాచనూరు సుబ్బరాయుడు, బీపీ ప్రతాప్ రెడ్డి, రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.