11 వేలకు పైగా కార్లు రీకాల్.. మీ కారు ఉందా?

11 వేలకు పైగా కార్లు రీకాల్.. మీ కారు ఉందా?

టయోటా కిర్లోస్కర్ మోటార్(TKM) సంస్థ తన మిడ్-సైజ్ SUV అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 9, 2024 నుంచి ఏప్రిల్ 29, 2025 మధ్య తయారు చేసిన మొత్తం 11,529 యూనిట్ల పెట్రోల్ వేరియంట్‌లను వెనక్కి పిలుస్తున్నారు. ఇంధన గేజ్‌లో లోపాన్ని గుర్తించారు. కొన్ని పరిస్థితుల్లో ఇది సరైన ఇంధన స్థాయిని చూపడం లేదని టయోటా తెలిపింది.