'వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే'

ప్రకాశం: ఎర్రగొండపాలెంకు చెందిన YCP నాయకుడు లక్ష్మీనారాయణ కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.