డాక్టరేట్ స్వీకరించిన సంధ్యారాణి

RR: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ షాద్‌నగర్‌లో సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న సంధ్యారాణి ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్ చేతుల మీదుగా PHD పట్టాను అందుకున్నారు. 'స్వయం సహాయక సంఘాల ద్వారా గంగపుత్ర కమ్యూనిటీలో మహిళా సాధికారత-నిజామాబాద్ జిల్లాలో ఒక అధ్యయనం' అనే అంశంపై చేసిన పరిశోధనకు యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది.