స్కూటర్‌ను ఢీకోన్న టిప్పర్.. యువకుడు మృతి

స్కూటర్‌ను ఢీకోన్న టిప్పర్.. యువకుడు మృతి

HNK: హసన్‌పర్తి మండలం మడిపల్లి–ఉనికిచర్ల రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవన్నపేటకు చెందిన పంజాల చరిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.