సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్

సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్

RR: గచ్చిబౌలి డివిజన్ నానక్‌రామ్‌గూడలో రూ. 49 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్థానికులతో కలిసి పరిశీలించారు. ​నిర్మాణ పనుల్లో ఎక్కడ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, అధికారుల పర్యవేక్షణలో పనులను వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.