అగ్ని ప్రమాదంలో గడ్డివాములు దగ్ధం

అగ్ని ప్రమాదంలో గడ్డివాములు దగ్ధం

NDL: దొర్నిపాడు మండలం భాగ్యనగరం గ్రామంలో నీలం శ్రీనివాసరెడ్డికి చెందిన గడ్డివాములు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. ఈ సంఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.