అదృశ్యమైన విద్యార్థినులు అప్పగించాం: ఎస్సై
ASR: చింతపల్లి మండలం వంగసార ఆశ్రమ పాఠశాల నుంచి అదృశ్యమైన ఐదుగురు విద్యార్థినులను పట్టుకుని వార్డెన్‌కు అప్పగించామని ఎస్సై వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఆదివారం 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు పాఠశాల విడిచి వెళ్లారన్నారు. సోమవారం తమకు ఫిర్యాదు అందిందన్నారు. చిన్నగెడ్డ సమీపంలో బాలికలు ఉన్నట్లు గుర్తించామని గంటలలోనే వారిని తీసుకొచ్చామని ఆయన తెలిపారు.