VIDEO: 'పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి'

VIDEO: 'పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి'

KMM: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్సై సంతోష్ అన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులర్పించారు. అనంతరం అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు. అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తి అని అన్నారు.