రైల్వేస్టేషన్‌లో పనులు పరిశీలించిన డీఆర్ఎం
NZB: నిజామాబాద్ రైల్వేస్టేషన్‌ను శుక్రవారం హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ సందర్శించారు. అమృత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా కొనసాగుతున్న రైల్వే అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డివిజనల్ రైల్వే మేనేజర్ ఆదేశించారు.