వనదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే

MHBD: బయ్యారం మండలం గంధంపల్లి సమ్మక్క-సారక్క వనదేవతలను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నేడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూక్య ప్రవీణ్ నాయక్, గ్రామ అధ్యక్షులు కారుబోతుల రామ్మూర్తి, చల్లా సురేష్, సపవట్ రాందాస్, చెరుకుపల్లి రవి, భూక్య శ్రీను, సత్యంమేస్త్రి వనదేవతలకు పూజలు చేశారు.