పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: భద్రాచలం వద్ద గోదావరి నదిలో మునిగి మృతి చెందిన విద్యార్థి సతీష్ మృతదేహం ఇవాళ వేకువజామున స్వగ్రామానికి చేరుకుంది. సమాచారం అందుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష వెంటనే పోతబోలు గ్రామం, కొయ్యలవారిపల్లికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడి తల్లిదండ్రులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.