VIDEO: రైతులకు మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే
కోనసీమ: కొత్తపేట మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్‌గా నియమితులైన పల్లి మంగాదేవి, వైస్ పర్సన్‌గా ఎంపికైన కంఠంశెట్టి శ్రీనివాసరావును ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం అభినందించారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తూ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేయాలని వారికి సూచించారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంలో తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు.