పాలకుర్తిలో బీజేపీ నేతల సంబరాలు
JN: బీహార్ శాసనసభ ఎన్నికల్లో NDA కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా పాలకుర్తిలో BJP నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, నితీష్ కుమార్‌ల అభివృద్ధి మంత్రానికి బీహార్ ప్రజలు పట్టం కట్టారు అని, కనీవినీ ఎరుగని రీతిలో 202 స్థానాలు గెలిచి ఎన్డీయే కూటమి చరిత్ర స్రృష్టించిందన్నారు.