20న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

ASR: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్ బి పోతురాజు డిమాండ్ చేశారు. డుంబ్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.