తండ్రి చితికి నిప్పు పెట్టిన కూతురు

SRCL: కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన సాసాల రాజు అసిస్టెంట్ హెల్పర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం పాలై మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు అశ్విత అన్ని తానై తండ్రి చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు నిర్వహించడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.