ప్రిన్సిపల్పై పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్

KRNL: ఎమ్మిగనూరులోని ఓ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. బుధవారం కళాశాలకు చేరుకుని సామగ్రిని ధ్వంసం చేశారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రిన్సిపల్పై పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యైఎస్ఎఫ్ఎ, ఎస్ఎఫ్ఎ తదితర సంఘాల సభ్యులు పాల్గొన్నారు.