ఎల్లంపల్లి ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు, నీటి నిల్వ 20.175 టీఎంసీలుగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 12, 500, క్యూసెక్కులు, కడెం నుంచి 9975 క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి 44104 క్యూసెక్కులు గోదావరి నదిలోకి విడుదల చేశారు.