ప్రజావాణిలో మాజీ సర్పంచుల వినతి
KNR: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మాజీ సర్పంచులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రామాల్లో అప్పులు తెచ్చి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.