ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు
MDK: కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల దేవస్థానంలో నేడు లక్ష దీపాలు వెలిగించనున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. కాగా, మరికొద్ది సేపట్లో అధికారికంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులు పుణ్య స్థానాలు చేసి ప్రమిదలను వెలిగించడం ప్రారంభించనున్నారు.