పట్టణంలో 53 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు
HNK: పట్టణంలో మంగళవారం రాత్రి CI సీతారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 53 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదైనట్లు CI వెల్లడించారు. ఇందులో 32 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరకగా, 21 మంది లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల పట్టుబడ్డారు. వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని CI సూచించారు.