బొబ్బిలిలో చిరుజల్లులు.. రైతుల్లో టెన్షన్
VZM: దిత్వా తుఫాన్ ప్రభావంతో బొబ్బిలి నియోజకవర్గం వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి వాతావరణం మారింది. మేఘాలు మబ్బులు కాసి అర్ధరాత్రి నుంచి చిరుజల్లులతో వర్షం కురవడంతో రైతుల్లో టెన్షన్ నెలకొంది. పంట పొలాల్లోనే 70 శాతం వరిపంట కుప్పలు వేసి ఉండడంతో వర్షానికి కుప్పలు నానితే పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.