'PGRS అర్జీలు సంతృప్తికరంగా పరిష్కరించాలి'
GNTR: PGRSలో అందిన అర్జీలను దరఖాస్తుదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి 260 అర్జీలు స్వీకరించారు. అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సకాలంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.