వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

TG: రాష్ట్రంలోని 21 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో కొద్దిసేపట్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు.