VIDEO: హోంమంత్రి పర్యటనలో ఆసక్తికర ఘటన
AKP: నక్కపల్లిలో హోం మంత్రి అనిత చేసిన పని పలువురిని ఆకట్టుకుంటుంది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసింది. ఈ క్రమంలో ఆమె మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తూ.. ఓ విద్యార్థి పక్కన కూర్చొని ముచ్చటిస్తూ గుడ్డు వొలిచి ఇచ్చింది. ఇలా చేయడంతో స్థానికులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.