'దళారులను నమ్మి మోసపోవద్దు'
SDPT: రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని ఐకేపీ ఏపీఎం మహిపాల్ సూచించారు. దౌల్తాబాద్ మండలం మల్లేశంపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కనకయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. మద్దతు ధర కేవలం ప్రభుత్వ కేంద్రాల్లోనే లభిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.