వాహనం ఢీకొని వ్యక్తి మృతి
SKLM: టెక్కలి- నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శనివారం వేకువజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. రాజగోపాలపురం గ్రామానికి చెందిన ఈయన శుక్రవారం అర్ధరాత్రి గ్రామం నుంచి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. టెక్కలి పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.