కేటీఆర్ సభకు ఎమ్మెల్యే బండ్ల హాజరుపై ఉత్కంఠ

కేటీఆర్ సభకు ఎమ్మెల్యే బండ్ల హాజరుపై ఉత్కంఠ

GDWL: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని సమాధానం ఇచ్చారు. శనివారం గద్వాలలో జరిగే కేటీఆర్ 'గద్వాల గర్జన' బహిరంగ సభకు ఆయన హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే వస్తారని చెబుతున్నా, పూర్తి స్పష్టత లేదు. మరి ఏం జరుగుతుందంటారు.