గ్రామానికి రోడ్డు నిర్మించాలని ప్రజల ఆవేదన

గ్రామానికి రోడ్డు నిర్మించాలని ప్రజల ఆవేదన

ASR: చింతపల్లి మండలం తమ్మీగుల పంచాయితీలోని గన్నేగుంట గ్రామంలో రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 70 ఏళ్లుగా ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు, ముఖ్యంగా వర్షాకాలంలో వాగులు పొంగి ప్రవహించడం వల్ల విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అధికారులు స్పందించి గన్నెగుంట, పెద్దగరువులలో రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.