ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ కుబేర గణపతి

ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ కుబేర గణపతి

పుంగనూరులోని సంత గేటు వద్ద ఉన్న శ్రీ కుబేర గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా ఆదివారం గణనాథుడు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. మొదట అర్చకులు గంధం, విభూదిలతోపాటు ఫల పంచామృతలతో అభిషేకించి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత ధూప దీప నైవేద్యం సమర్పించారు. భక్తులు కుబేర గణపతిని దర్శించి పూజలు నిర్వహించారు.