విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం
NLG: నల్గొండలోని బోయవాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ నెల 27 నుంచి జూన్ 5 వరకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు డీఈవో బిక్షపతి తెలిపారు. జిల్లా బాలభవన్, బాలకేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు కుట్లు-అల్లికలు, శాస్త్రీయ నృత్యం, చిత్రలేఖనం, బ్యూటీషియన్ కోర్సుల్లో ఉ. 8 నుంచి 11 గంటల వరకు శిక్షణ ఇస్తారు.