ప్రజలు బీఆర్‌ఎస్‌ను కోరుకుంటున్నారు: మల్లారెడ్డి
మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాజీ కార్పొరేటర్ రవి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఆదివారం చేరారు. ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.