నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
NLD: నాగార్జున సాగర్‌కు వరద ప్రభావం కొనసాగుతుండటంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరుతుంది. దీంతో శుక్రవారం ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 67,738 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు.