అక్రమ ఇసుక రవాణా నివారణకు కందకాలు: ఎస్సై
MHBD: నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు, బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాల పరిధిలోని ఆకేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఇసుక రవాణాను అరికట్టేందుకు జేసీబీ సహాయంతో కందకాలు తవ్విస్తున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. అప్పటికే ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసి నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.