ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ పై ప్రత్యేక నిఘా

ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ పై ప్రత్యేక నిఘా

PPM: రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల ప్రకారం ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రాంతీయ ఎన్ఫోర్స్మెంట్ అధికారి బర్ల ప్రసాదరావు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు రైతులకు అత్యంత కీలకమైన యూరియా ఎరువును దాచిపెట్టడం బ్లాక్ మార్కెటింగ్ నివారించేందుకు ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం యూరియా అక్రమ నిల్వ ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు.