సరిపడా ఎరువుల నిల్వలు ఉంచాలి: కలెక్టర్

NZB: జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచనున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా అనునిత్యం పర్యవేక్షించాలన్నారు.