ఇంధన నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన

ఇంధన నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన

ఇంధన నిల్వలపై భారత పెట్రోలియం శాఖ కీలక ప్రకటన చేసింది. దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం 26 కోట్ల టన్నుల చమురు అందుబాటులో ఉందని పేర్కొంది. LPG సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పింది. వాణిజ్య గ్యాస్ కేటాయింపును 50 శాతం పెంచినట్లు స్పష్టం చేసింది.