'మీ డబ్బు-మీ హక్కు'పై కలెక్టర్ పోస్టర్ ఆవిష్కరణ

'మీ డబ్బు-మీ హక్కు'పై కలెక్టర్ పోస్టర్ ఆవిష్కరణ

సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో 'మీ డబ్బు-మీ హక్కు' ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. గత పదేళ్లుగా లావాదేవీలు లేని బ్యాంకు ఖాతాల నుంచి సంబంధిత వ్యక్తులు తమ డబ్బును తిరిగి పొందేందుకు ఆర్బీఐ కల్పించిన ఈ అవకాశాన్ని డిసెంబర్ 31 వరకు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.