1న ఖమ్మంలో ఉచిత మెడికల్ క్యాంప్
KMM: వచ్చే నెల 1న BVK, CPM సంయుక్త ఆధ్వర్యాన ఖమ్మం నగరంలోని మంచికంటి హల్లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు CPM ఖమ్మం డివిజన్ సెక్రటరీ వై.విక్రమ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా ప్రతి నెలా మొదటి శనివారం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుండగా ఈనెల ఇండస్ ఆస్పత్రి సౌజన్యంతో ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేస్తామని తెలిపారు.