రామగుండం గనుల్లో ప్రత్యేక అధికారి తనిఖీలు
PDPL: రామగుండంలోని సింగరేణి సంస్థ ఆర్జీ-1 పరిధిలోని బొగ్గు గనులను DDMS (ఎలక్ట్రికల్) అధికారి కమలేశ్ చౌదరి సందర్శించారు. అనంతరం ఇల్లందు గెస్ట్ హౌస్‌లో జీఎం లలిత్ కుమార్ ఆయనను కలిశారు. ఈనెల 6 నుంచి 9 వరకు గనులలో తనిఖీలు నిర్వహించి, కార్మికుల రక్షణ, విద్యుత్ ప్రమాదాల నివారణపై సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు.