రంగా విగ్రహానికి పేడ పూసిన గుర్తు తెలియని వ్యక్తులు

ELR: కలిదిండి మండలం సానా రుద్రవరంలోని వంగవీటి మోహన రంగా విగ్రహంపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు పేడ పూశారు. ఈ విషయం తెలుసుకున్న కాపు వర్గీయులు, రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.