చెరువులో గ్రానైట్ వ్యర్ధాలు
ప్రకాశం: కనిగిరి నాగుల చెరువులో గ్రానైట్ క్వారీల వ్యర్ధాలను డంపింగ్ చేస్తున్నారు. చెరువులో గ్రానైట్ రాళ్ల వ్యర్ధాలు వేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. భూగర్భ జలాలు భూమిలో ఇంకే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్ రాళ్ల వ్యర్ధాలు చెరువులో డంపింగ్ చేయకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.