నీటి భద్రతపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్: ఎమ్మెల్యే కన్నా
PLD: “నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం వంద రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించారు. కాల్వలు, చెరువులు, చెక్‌డ్యాంలను పునరుద్ధరించి నీటి నిల్వకు సిద్ధం చేయాలని తెలిపారు.