చట్టాలపై అవగాహన కల్పించిన ఎస్సై
VZM: జిల్లా ఎస్పీ AR. దామోదర్ ఆదేశాలతో డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉడికలపేట గ్రామస్తులకు ఎస్సై సన్యాసినాయుడు, సిబ్బందితో చట్టాలపై శుక్రవారం రాత్రి అవగాహన కల్పించారు. గ్రామాల్లో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడోద్ధని హితవు పలికారు. గ్రామాల్లోకి అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.