మహిళ ఉద్యోగిని వేధిస్తున్న వ్యక్తికి రిమాండ్
VZM: కొట్టాం పీ.హెచ్.సీ.లో ఓ మహిళ ఉద్యోగిని ఎల్. కోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన కే. ఎర్రాయుడును కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. ఉద్యోగం పోయేలా చేస్తానని ఆమెను బెదిరించాడు. గత నెల 28న, ఎస్. కోట పోలీసు స్టేషన్‌లో బాధితురాలు పిర్యాదు చేశారు. ఈ మేరకు అతనిపై ఎస్సై ఎల్. చంద్రశేఖర్ కేసు నమోదు చేయడంతో నిందుతుడుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు.