VIDEO: చరిత్ర చెప్పే శిల్పం.. అసాంఘిక శక్తులకు నిలయం

VIDEO: చరిత్ర చెప్పే శిల్పం.. అసాంఘిక శక్తులకు నిలయం

ELR: నూజివీడు ఘన చరిత్రకు శాశ్వత చిరునామాగా నిలిచిన కుక్కల గేటు శిధిలావస్థకు చేరడంతో పట్టణ ప్రాంత ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజా మేక రంగయ్యప్పారాయలు 1882లో కుక్కల గేటు నిర్మాణం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ చారిత్రాత్మక కట్టడంపై పిచ్చి మొక్కలు పెరిగి పగుళ్ళు రావడం, కొందరు మద్యం సేవించి బాటిళ్లను కింద గదిలో వేయడం దారుణమని ప్రజలు వాపోతున్నారు.